Chaitu

Chaitu
Kabhi Sochtha Hun Zindagi Bhi Kya Mazaak Hai..

My SOUL.............

My SOUL.... This Blog brings the best out of me!! It carries my emotions..
Note - Each song i posted, has a small music player attached to it which will aid u in listening to the song.. To get a seamless play of the song, use the BLOG ARCHIVE provided on the right side of the page.. There you have the complete list of songs.. Click on the song u would like to hear.. Play the music player at this level.. It starts immediately.. Enjoy.. :)

Blog Visitors Count [Based on Unique Users visiting the site]

Monday, March 1, 2010

జీవన వాహిని


జీవన వాహిని పావని..

కలియుగమున కల్పతరువు..
నీడ నీవని..
కనులు తుడుచు కామధేను..
తోడు నీవని..




వరములిచ్చి భయము తీర్చి..
శుభము కోర్చు గంగాదేవి..

నిను కొలిచిన చాలునమ్మ..
సకల లోకపావని..




భువిని తడిపి దివిగ మలచి..
సుడులు తిరుగు శుభగాత్రి గంగోత్రి..

గలగలగల గంగోత్రి..
హిమగిరిదరిహరిపుత్రి..



మంచు కొండలో ఒక కొండవాగులా..
ఇల జననమొందిన విరజావాహిని..

విష్ణుచరణమే తన పుట్టినిల్లుగా..
శివగిరికి చేరిన సురగంగ నీవని..





అత్తింటికి సిరులనొసను అలకనందమై..
సగర కులము కాపాడిన భాగీరధివై..

బదరీవన హృషీకేశ..
హరిద్వార ప్రయాగముల..
మణికర్ణిక తనలోపల..
వెలసిన శ్రీవారణాసి గంగోత్రి..



పసుపు కుంకుమతో..
పాలు పన్నీటితో..
శ్రీగంగపు ధారతో..
పన్చామ్రుతాలతో..

అంగాంగం తడుపుతూ..
దోషాలను కడుగుతూ..
గంగోత్రికి జరుపుతున్న..
అభ్యంగల స్నానం..


అమ్మ గంగమ్మ..

క్రిష్నమ్మకి చెప్పమ్మ..
కష్టం కలిగించొద్దని..
యమునకి చెప్పమ్మ..
సాయమునకి వెనకాడొద్దని..


గొదారికి కావేరికి..
ఏటికి సెల ఏటికి..
కురిసేటి జడివానకి..
దూకే జలపాతానికి..
నీ తోబుట్టువలందరికి..

చెప్పమ్మా మా గంగమ్మా..





జీవనదివిగా ఒక మోక్ష నిధివిగా..
పండ్లుపూలుపసుపుల పారాణి రాణిగా..

శివుని జటలనే తన నాట్యజతులుగా..
జలకమాడు సతులకు సౌభాగ్యధాత్రిగా..





గండాలను పాపాలను కడిగివేయగా..

ముక్తినదిని మూడుమునకలే చాలుగా..






జలదీవెన తలకుపోసె..
జననీ గంగాభవాని..

ఆమె అండ మంచుకొండ..
వాడని సిగపూదండ గంగోత్రి..


5 comments:

  1. the first song written in telugu font..the lyrics of the song and pictures r apt...it takes us to a different world while listening to the song...awesome job..

    Thanks & Regards
    viswateja Surampudi

    ReplyDelete
  2. awesome job!!!
    this is one of my fav song.. the way u described the lyrics with the apt pics made things different..
    loved it...keep rocking..

    ReplyDelete
  3. Keeravani's Bestt composition ever!!!!!!lyric kuda tooo gudd untundhi.....superbbbbb songg...!!!!

    ReplyDelete
  4. One of the best songs I ever loved.
    An electrifying composition and rendition.
    The lyrics are absolutely........... hmmmm
    I don't have an adjective for that. :)
    They are that good!
    Very apt pics for the song.

    ReplyDelete
  5. wonderful Song......asalu wonderful anedi chala chala chinna word...i donno what to say...
    elanti paata maali inkoti raademo...Excellent
    and very very beautiful pictures ... a paata lage

    ReplyDelete

Thanq for ur valuable comments.. This will defintely aid me in improving my blog!